చెన్నై నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులు ఇకపై కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ నెల ఆరు నుంచి దుబాయ్‌కి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా చెన్నై నుంచి వచ్చే ప్రయాణికులు నెగిటివ్, ఆర్టీపీసీఆర్ పరీక్షలకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వాటిని రద్దు చేసినట్లు చైనా విమానాశ్రయ అధికారులు తెలిపారు.