రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ సైబీరియన్ పీనల్ కాలనీ జైలులో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్దీవదేహాన్ని అప్పగించేందుకు రెండు వారాల సమయం పడుతుందని అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రెండు వారాల తర్వాతే నావల్నీ మృతదేహాన్ని అప్పగించనున్నట్లు అధికారులు చెప్పారు. నావల్నీ శరీరానికి రసాయనిక విశ్లేషణ చేపడుతు న్నామని ఆయన తల్లికి అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. నావల్నీ పార్దీవదేహం ఎక్కడ ఉందన్న దానిపై మాత్రం రష్యా అధికారులు ప్రకటన ఏమీ చేయలేదు. ఆ ప్రయత్నాలను కూడా రష్యా అధికారులు కొట్టిపారేశారు.