ఖతర్‌లో ప్రవాసీ ఇంజినీర్ల సంఘమైన తెలుగు ఇంజినీర్ల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన వన భోజనాల కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా సేద తీరారు. కార్తీక మాస చివరి వారం ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ సంఘాలలో ఒకటయిన ఖతర్ తెలుగు ఇంజినీర్ల ఫోరం వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అందర్నీ కలుపుతూ జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముస్లిం మహిళలు కూడా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఫోరం ప్రధాన కార్యదర్శి జి.కె. దొర లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖతర్‌లోని వివిధ ప్రాజెక్టులలో పని చేస్తున్న ఇంజినీర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సహాల మధ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యక్షురాలు (సాంస్కృతిక కార్యక్రమాలు) దీపా సుధాకర్, ఉపాధ్యక్షురాలు (మహిళా విభాగం) రమ్య (మంజరి), ఉపాధ్యక్షులు (ఈవెంట్స్) ఇంజినీర్ త్రిశాల్, సీనియర్ తెలుగు ఇంజనీర్స్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ మార్గదర్శకత్వంతో పాటు కీలక సభ్యులు విశాల్ రాయపూడి, శ్రీకృష్ణ, రమేష్ బాబులు, అధ్యక్షులు నవాజ్ అలీ ఖాన్ సమన్వయంతో నిర్వహించారు.