Namaste NRI

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి(88) రోశయ్య కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం ఇంట్లో పల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని స్టార్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాజీకీయ కురవృద్ధుడైన రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌ పూర్తి చేశారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నాకైన రోశయ్య ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్‌.జి.రంగా శిష్యులు, నిడుబ్రోలులో రాజకీయ  పాఠశాలు నేర్చుకున్నారు.

                కాంగ్రెస్‌ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్‌ అండ్‌ బీ, రవాణా శాఖ మంత్రిగా సేవలు అందించారు. కాంగ్రెస్‌ సీఎంలందరి వద్ద పలు కీలకమైన శాఖల బాధ్యతల నిర్వర్తించారు. 2004`09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా ఎవ్మెల్సీగా కొనసాగారు. రాష్ట్ర మంత్రివర్గంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవశాలి రోశయ్య. 2009 సెప్టెంబరు 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నరుగా బాధ్యతలు చేపట్టి 2016 ఆగస్టు 30 వరకూ సేవలు అందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events