Namaste NRI

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ ఇకలేరు

 కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ కన్నుమూశారు. గతకొంత కాలంగా వృద్ధాప్యం రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది 29న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కారణంగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో దవాఖానలో చేరారు. నాలుగు నెలలపాటు చికిత్స అనంతరం కోలుకున్న ఆయన ఆగస్టు 28న డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఆయనను ఆ తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడటంతో మంగళవారం తెల్లవారుజామను కన్నుమూశారు.

పాత మైసూరు ప్రాంతంలోని మద్దూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎస్‌ఎం కృష్ణ, 1999 నుంచి 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌ గా, కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1971 నుంచి 2014 వరకు వివిధ సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1989 డిసెంబర్ నుంచి జనవరి 1993 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. చాలా కాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2017 మార్చి లో బీజేపీలో చేరారు. ఆయన చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress