పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పేరుని ప్రకటించారు. దీంతో కొన్ని నెలలుగా ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తెరపడిరది. తన పార్టీ పేరు పంజాబ్ లోక్ కాంగ్రెస్ అని ఆయన ప్రకటించారు. వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. అమరీందర్‌సింగ్ ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ బలవంతం మీద సీఎం పదవి నుంచి వైదొలిగారు. అమరీందర్ సింగ్ స్థానంలో హైకమాండ్ చరణ్‌జీత్ సింగ్ చన్నిని కొత్త సీఎంగా నియమించింది. అప్పటి నుంచి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనట్లుగా ఉంటూ వచ్చారు. పార్టీ తనను అవమానకర రీతిలో పదవి నుంచి తప్పించిందని పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు.