Skip to main content

Namaste NRI

వాట్ ది ఫిష్ కోసం ఒకేసారి.. నలుగురిని దింపారు

నిహారిక కొణిదెల, వెన్నెల కిషోర్‌, అదితి, జాన్సన్‌, హరినాథ్‌ పొలిచెర్ల తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వాట్‌ ది ఫిష్‌. వెన్‌ ద క్రేజీ బికమ్స్‌ క్రేజీయర్‌ ఉపశీర్షిక. వరుణ్‌ కోరుకొండ దర్శకుడు. సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో అదితి, జాన్సన్‌, హరినాథ్‌ పొలిచెర్ల, సుస్మితా ఛటర్జీ, సత్య జాయిన్‌ అయ్యారు.

దర్శకుడు మాట్లాడుతూ యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌ కథాంశమిది. ఇప్పటికే విడుదలైన నిహారిక కొణిదెల, వెన్నెల కిషోర్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌కు మంచి స్పందన లభించింది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తు న్నాం . వివిధ భారతీయ భాషల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతాన్నందిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News