Skip to main content

Namaste NRI

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌.. అనూహ్య నిర్ణయం

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఎన్నికల్లో విపక్ష పార్టీ నేషనల్‌ ర్యాలీ విజయం సాధిస్తుందన్న అంచనాల నేపథ్యంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రజావిశ్వాసం మేరకు ఫ్రాన్స్‌ జాతీయ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని మేక్రాన్‌ భావిస్తున్నారు. ఈయూ ఎన్నికల్లో మేక్రాన్‌పార్టీ రెనాయిసెన్స్‌కు 15 శాతం ఓట్లు, ప్రతిపక్ష నేషనల్‌ ర్యాలీ పార్టీకి సుమారు 32 శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అయితే దేశంలో తమ పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోలేదని నిరూపించేందుకు మేక్రాన్‌ ముందస్తు ఎన్నికలకు పిలుపు నిచ్చారు. ఈ రోజు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా.ఈ నిర్ణయం చాలా పెద్దది. ప్రజాస్వామ్యం మీద ఉన్న నమ్మకంతో, భవిష్యత్‌ తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా అని మేక్రాన్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News