పామర్రు మండల కేంద్రంలో పామర్రు పాలకేంద్రం లో తానా ఫౌండేషన్, కృష్ణా మిల్క్ యూనియన్ మరియు రోటరీ క్లబ్ వారిచే సంయుక్తంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ యార్లగడ్డ వెంకటరమణ గారు ప్రారంభించారు. మొత్తం 774 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా 111 మంది కాట్రాక్టు సర్జరీ అవసరమైన వారు ఉన్నారు. 663 మందికి ఉచితంగా కళ్ళజోళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటరమణ యార్లగడ్డ గారితో పాటు కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల యూనియన్ అధ్యక్షులు చలసాని ఆంజనేయులు గారు, సుమారుగా 800మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురుషోత్తం చౌదరి కి కెఎంయూ ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేసారు.