టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలకు తమ విమానాల్లో ఉచితంగా ప్రయాణించే ఆఫర్‌ను దేశీయ విమానాయన సంస్థలు ప్రకటించాయి. జీవిత కాలం పాటు ఉచితంగా టికెట్లు అందిస్తామంటూ స్టార్ ఎయిర్ పేర్కొనగా, ఐదేండ్ల పాటు ఆఫర్ ఇస్తామని గో ఫస్ట్ తెలిపింది. విశ్వక్రీడల్లో వందేండ్ల తర్వాత దేశానికి తొలి పతకం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు ఇప్పటికే ఇండిగో సంస్థ ఏడాది పాటు తమ విమానాల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.