Namaste NRI

భారత్‌కు బదిలీ చేయం.. తేల్చి చెప్పిన ఫ్రాన్స్‌ ప్రభుత్వం

భారత్‌కు 114 రఫేల్‌ యుద్ధ విమానాల అమ్మకం కోసం జరుగుతున్న చర్చల్లో భాగంగా స్పెక్ట్రా ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సూట్‌, ఇతర ముఖ్యమైన ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ల కోసం కీలకమైన సోర్స్‌ కోడ్‌లను బదిలీ చేయడాన్ని ఫ్రాన్స్‌ ప్రభుత్వం తోసిపుచింది. ఈ ఆంక్షల కారణంగా ఫ్రాన్స్‌ ఆమోదం, మద్దతు లేకుండా భారత్‌ స్వతంత్రంగా కొన్ని సెన్సార్లు, ఆయుధాలను అనుసంధానించే లేదా విమాన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. సోర్స్‌ కోడ్‌ లేకుండా భారత్‌ స్వదేశీ ఆయుధాల కోసం రఫేల్‌ను వేగంగా ప్రోగ్రామ్‌ చేయలేకపోయిందని, డేటా లింక్‌ ఇంటర్‌ ఆపరేబిలిటీని ఆప్టిమైజ్‌ చేయలేకపోయిందని అమెరికా వైమానిక దళ మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ డేవిడ్‌ డెఫ్టులా తెలిపారు.

ఇది ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఒక రఫేల్‌ కోల్పోవడానికి దోహదపడిందని ఆయన చెప్పారు. అయితే పాకిస్థాన్‌తో జరిగిన సైనిక ఘర్షణలో రఫేల్‌ యుద్ధ విమానం నష్టాన్ని భారత్‌ ఎప్పుడూ అధికారికంగా అంగీకరించలేదు. కాగా, 2025 జూలై 8న సీఎన్‌బీసీ-టీవీ18కి ఇంటర్వ్యూ ఇచ్చిన భారత రక్షణ కార్యదర్శి ఆర్‌కే సింగ్‌ రఫేల్స్‌ అని మీరు బహు వచనంలో మాట్లాడారు, కానీ అది కచ్చితంగా తప్పని నేను హామీ ఇవ్వగలను అని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events