Namaste NRI

ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు పటిష్టం : మోడీ

 భారత్ ఆస్ట్రేలియాల బంధానికి పెట్టని కోట అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మూడు దేశాల పర్యటనల్లో భాగంగా ఆస్ట్రేలియాకు వచ్చిన ప్రధాని సిడ్నీ శివార్లలో జరిగిన సభలో మాట్లాడారు. లిటిల్ ఇండియాగా నామకరణం చేసిన ఈ వేదిక నుంచి ఆయన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనెస్‌తో కలిసి పాల్గొన్నారు. భారతీయ సంతతివారిని ఉద్ధేశించి ఆయన ఈ భారీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇక్కడ వెలిసిన ఈ లిటిల్ ఇండియా ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిఫలిస్తోందన్నారు. ఇరుదేశాలకు క్రికెట్ అంటే ప్రాణప్రదం, ఇరుదేశాలకు చెందిన క్రికెటర్లు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని తెలిపిన ప్రధాని ఈ సందర్భంగా గవాస్కర్, గ్రేగ్ ఛాపెల్ పేర్లను ప్రస్తావించినప్పుడు భారతీయ సంతతివారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఇరు దేశాల సంబంధాలు స్థిరమైనవే కాకుండా క్రమేపీ స్థిరంగా పురోగమిస్తూ ఉన్నాయని ప్రధాని మోడీ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంబంధాలు రెండింతలు మూడింతలు అవుతాయన్నారు. గత ఏడాది ఇరుదేశాల మధ్య కుదిరిన ఎకనామిక్ , ట్రేడ్ అగ్రిమెంట్ సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి ఇరుదేశాల మధ్య సమగ్రమైన ఆర్థిక సహకార ఒప్పందం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థిరమైన విశ్వసనీయ సరఫరా వ్యవస్థల ద్వారా ఉభయదేశాలు మరింత సన్నిహితం అవుతాయని తెలిపిన ప్రధాని ఇటువంటి ప్రక్రియ కేవలం ఇరుదేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి సరైన విశ్వాసం కల్పిస్తుందన్నారు.  ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఎకనామి అని ఈ విధంగా పలు అంశాలను తెలియచేయవచ్చునని, అయితే రెండు దేశాల మధ్య స్నేహం పూర్తిగా వీటిన్నింటికీ మించిన వాస్తవిక ప్రగాఢ అనుబంధం మీదనే ఆధారపడి ఉందన్నారు. ఆస్ట్రేలియాలో భారతీయ సంతతి వారి సేవలను ప్రధాని కొనియాడారు.

ఇరు దేశాల మధ్య భూమిపరంగా చాలా దూరం ఉండవచ్చు. అయితే హిందూ మహాసముద్రం రెండు దేశాలను దగ్గర చేస్తుందని, సంస్కృతి సంప్రదాయాలు భిన్నం కావచ్చు అయితే అంతర్లీనంగా ఏకత్వం ఇన్నేళ్లుగా ఈ బంధం పటిష్టం అవుతోందన్నారు.యోగా ఇరుదేశాలను అనుసంధానం చేస్తుంది. ఏళ్ల తరబడిగా ఇరుదేశాల మధ్య క్రికెట్ ఓ వారధిగా ఉంది. క్రికెట్‌లో రెండు దేశాలు పోటాపోటీగా వ్యవహరించిన తీరు ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది. అయితే ఆసక్తికరమైన ఈ పోటీ స్థాయిలోనే వెలుపల ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు పటిష్టం అవుతూ వచ్చాయన్నారు. టెన్నిస్, సినిమాలు ఇరు దేశాలను కలిపే బంధాలు అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events