Namaste NRI

అమెరికాతో దోస్తీ ముగిసింది.. ఇక ప్రతీకార చర్యలు తప్పవు

కెనడా పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశ ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు విధించడంతోపాటు,  తాజాగా వాహన దిగుమతులపై కూడా 25శాతం సుంకాన్ని విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రకటనపై కెడాన ఘాటుగా స్పందించింది. ఈ చర్యతో అమెరికాతో పాత దోస్తీ ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు.

ఏప్రిల్‌ 3 నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వాహనాలపై 25శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం కెనడా ఆటో పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బే. దాదాపు 5 లక్షల ఉద్యోగాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events