
అల్లరి నరేశ్ ఉద్వేగపూరితమైన పాత్ర పోషించిన యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బచ్చలమల్లి. అమృత అయ్యర్ కథానాయిక. సుబ్బు మంగదేవి దర్శకత్వం. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్‌ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు. మాఊరి జాతరలో కాటుక కళ్లతో.. చాటుగ రమ్మనీ సైగే చేసే చిన్నదీ అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయగా, విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచి సింధూరితో కలిసి ఆలపించారు. అల్లరి నరేశ్, అమృత అయ్యర్ పాత్రల ప్రేమను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ, దానికి తగ్గట్టు విజువల్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయని, ఈ సినిమాలో చాలా కీలకంగా వచ్చే పాట ఇదని మేకర్స్ చెబుతు న్నారు. రోహిణి, రావురమేశ్, అచ్యుత్‌కుమార్, బలగం జయరామ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్, నిర్మాణం: హాస్య మూవీస్.
