శివ కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ప్రిన్స్. అనుదీప్ కెవీ దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్ నారంగ్, సురేష్‌బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. మరియా ర్యాబోషప్క నాయిక. సత్య రాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో నాయకానాయికలు ఇద్దరూ పసుపు రంగు దస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ సకుటుంబ కథా చిత్రమిది. వినోదానికి పెద్దపీట వేస్తున్నాం. పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా అందరిని మెప్పిస్తుంది అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమాహంస, సహనిర్మాత : అరుణ్ విశ్వ, రచన`దర్శకత్వం` అనుదీప్ కేవీ. సంగీతం: తమన్. తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో రూపొందిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
