ఎఫ్ 2 తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడిరతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ఎఫ్ 3 టీమ్. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో మొదటి పాట లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు.. ని ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో మూడో హీరోయిన్‌గా సోనాల్ చౌహాన్ కనిపించనున్నారు. ఎఫ్ 2కు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఒక పాట మినహా టాక్ పార్ట్ పూర్తయింది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల వాణిజ్య హంగులతో సినిమా అలరిస్తుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహకుడిగా వ్యవహరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28న ఎఫ్ 3 విడుదల కానుంది.