ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పడుకోన్ వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర దర్శకుడు నాగ్అశ్విన్ మాట్లాడుతూ సినిమా టైటిల్‌తో పాటు కథాంశంలోని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కథ మహాభారత కాలంలో మొదలై 2898 కాలంలో ముగుస్తుందని చెప్పారు. గతంలో ప్రారంభమై భవిష్యత్తులో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టామని తెలిపారు. 6000 సంవత్సరాల కాల వ్యవధిలో జరిగే కథ ఇది. భూత, భవిష్యత్ కాలాలను ఆవిష్కరిస్తూ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాం. ప్రతి సన్నివేశంలో భారతీయత ఉట్టిపడుతుంది. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం బ్లేడ్ రన్నర్ తో ఈ సినిమాకు ఎలాంటి పోలికలు ఉండవు. ఈ సినిమా ఛాయలు ఏమాత్రం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. మే 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ గ్లింప్స్‌తో పాటు ఇటీవల విడుదల చేసిన జస్ట్ ది వార్మ్ అప్ వీడియో కు అద్భుతమైన స్పందన లభించింది.