నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నా సామి రంగ. విజయ్ బిన్ని దర్శకుడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్నది. ఆమె ఫస్ట్‌లుక్‌కు విడుదల చేశారు. వరలక్ష్మీ పాత్రలో ఆమె సంప్రదాయ దుస్తులు ధరించి ఆకర్షయణీయంగా కనిపిస్తున్నది. కంప్లీట్ మాస్ యాక్షన్ చిత్రమిది. నాగార్జున పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కథానాయిక అషికా రంగనాథ్ అభినయ ప్రధానమైన పాత్రను పోషించింది. కథాగమనంలో ఆమె క్యారెక్టర్ కీలంకంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది అని చిత్ర బృందం పేర్కొంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, సాహిత్యం: చంద్రబోస్, దర్శకత్వం: విజయ్ బిన్ని.