
కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతోన్న పీరియాడిక్ థ్రిల్లర్ క. నయన్ సారిక, తన్వీరామ్ కథానాయికలు. సుజీత్, సందీప్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాత. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిరణ్ మాట్లాడారు. ఎస్‌ఆర్ కళ్యాణమండపం, రాజావారు రాణీవారు బాగా ఆడాయి. ఆ తర్వాత సైన్ చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. కథను బట్టి సీన్స్ ఉంటాయి. సీన్స్ బలంగా ఉంటే నటించే అవకాశం ఉంటుంది. ఇది ప్రతిఒక్కరూ గ్రహించాలి. వీడి పని అయిపోయింది అని ఎవరైనా అంటే నమ్మకండి. మన పని అయిపోయిం దా లేదా అనేది మనకే తెలుస్తుంది. నిజంగా నా పని అయిపోయిందని అనిపిస్తే సినిమాలు చేయను. ఇక నుంచి ఒళ్లు దగ్గర పెట్టుకొని సినిమాలు చేస్తా. క కచ్చితంగా అందరూ మెచ్చే సినిమా అవుతుంది అని అన్నారు. ఇదొక పల్లెటూరి నేపథ్యంలోసాగే యాక్షన్ థ్రిల్లర్ అని, అవకాశం ఇచ్చిన నిర్మాత చింతా గోపాల కృష్ణా రెడ్డి, హీరో కిరణ్ అబ్బవరంకు కృతజ్ఞతలని దర్శకులు చెప్పారు. త్వరలో పాన్‌ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది
