మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు. గుంటూరులో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించా రు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ సినిమాకు వందశాతం పనిచేయాలంటే రెండొందల శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్‌బాబు ఒక్కరే అని చెప్పడం అతిశయోక్తి కాదు. అతడు, ఖలేజా టైమ్‌లో మహేష్ బాబు ఎలా ఉన్నాడో, ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. పర్‌ఫార్మెన్స్‌లో కూడా అంతే నూతనత్వం కనిపిస్తున్నది. ఈ సంక్రాంతిని రమణగాడితో కలిసి జరుపుకుందాం అన్నారు.
మహేష్‌బాబు మాట్లాడుతూ గత 25 ఏండ్లుగా మీరు చూపిస్తున్న అభిమానాన్ని మరచిపోలేను. ప్రతి ఏడాది అది పెరిగిపోతున్నది. సంక్రాంతి నాన్నగారికి, నాకు బాగా కలిసొచ్చిన పండగ. ఈ సీజన్‌లో మా సినిమా రిలీజై తే అది బ్లాక్‌బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొట్టబోతున్నాం అన్నారు. త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఫ్రెండ్‌కంటే ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్‌లా ఫీలవుతాను. ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా పర్ ఫార్మెన్స్ విషయంలో ఓ మ్యాజిక్ జరిగిపోతుంది. అతడు, ఖలేజా సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉందనిపి స్తుంది. గుంటూరు కారం విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమాలో కొత్త మహేష్‌బాబుని చూడబోతు న్నారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కుర్చీ మడతపెట్టి పాటకు థియేటర్లు బద్దలైపోతాయి. నాన్నగారు నా సినిమా చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించేది. ఆయన ఫోన్ కాల్ కోసం ఎదురుచూసేవాడిని. ఇప్పుడు ఆ వివరాలన్నీ మీరే నాకు చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న అన్నారు. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.