సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ పట్టాభి తెరకెక్కించిన చిత్రం గాడ్సే. ఐశ్వర్యలక్ష్మి, బ్రహ్మాజీ, సిజ్జూ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రం నుంచి రా రమ్మంది ఊరు రయ్యంది హుషారు అనే గీతాన్ని విడుదల చేశారు. సునీల్ కశ్యప్ బాణీలు సమకూర్చగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. రామ్ మిర్యాల ఆలపించారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. అవినీతిమయమైన రాజకీయ నాయకులను, వ్యవస్థను ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువకుడి పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కనిపిచనుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం విడుదలైన ఈ పాట యూట్యూబ్లో టాప్ ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రాన్ని సి.కల్యాణ్ నిర్మించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.














