Namaste NRI

షష్టిపూర్తి చిత్రం నుంచి.. రాత్రంతా రచ్చే – మరి నువ్వంటే పిచ్చే

డా.రాజేంద్రప్రసాద్‌, అర్చన ముఖ్య తారలుగా, రూపేష్‌, ఆకాంక్షసింగ్‌ జంటగా,  పవన్‌ ప్రభ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షష్టిపూర్తి. మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ నిర్మిస్తున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ క్రమంలోనే మూడో పాటను విడుదల చేశారు. రాత్రంతా రచ్చే.. మరి నువ్వంటే పిచ్చే.. నీమాటే నచ్చే.. మది మరుమైల్లె విచ్చే అంటూ సాగే ఈ పాటను చైతన్యప్రసాద్‌ రాయగా యువన్‌శంకర్‌రాజా, నిత్యశ్రీ ఆలపించారు. ఈ సందర్భంగా యువన్‌ శంకర్‌రాజా మాట్లాడుతూ మా నాన్న సంగీత దర్శకత్వంలో ఈ తెలుగు పాట పాడినందుకు ఆనందంగా ఉంది.తెలుగులో నేను పాడిన తొలి పాట ఇది. ఇది చాలా కూల్‌ సాంగ్‌. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.’ అని తెలిపారు. యువన్‌ ఈ పాటను అద్భుతంగా పాడారని, ఇప్పటివరకూ విడుదలైన రెండు పాటలు ఒకెత్తయితే.. ఈ పాట మరో ఎత్తని, ఫుల్‌ రొమాంటిక్‌ జోష్‌లో ఈ పాట ఉంటుందని, కళాదర్శకుడు తోట తరణి ఈ పాట కోసం నాలుగు సెట్లు వేశారని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events