భారత్, చైనా సరిహద్దుల్లోని ఉద్రికత్తలు తగ్గించే విషయంపై భారత్ తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దుతు ఇస్తున్నామని అమెరికా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో డిసెంబర్ 9వ తేదీన చైనా ఆర్మీని భారత సైనికులు అడ్డుకున్న విషయం తెలిసిందే. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు వచ్చిన పీఎల్‌ఏ దళాన్ని మన సైనికులు సమర్థవంతంగా తిప్పికొచ్టారు. ఆ అంశంపై గురించి పార్లమెంట్‌లో కేంద్ర ప్రకటన కూడా చేసింది. కాగా భారత్, చైనా ఘర్షణపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది. వాస్తవాధీనరేఖ వద్ద నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాట్లు ఓ ప్రకటనలో వెల్లడిరచింది. భారత్, చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద పరిణామాలను మా రక్షణ శాఖ జాగ్రత్తగా గమనిస్తోంది. సరిహద్దుల్లో చైనా తమ దళాలను మోహరిచింది. పలు నిర్మాణాలు చేపడుతోందని అమెరికా పేర్కొంది.