అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్‌కు విశిష్ట ఘనత దక్కింది. ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ అధికారికంగా చేపట్టింది. భారత్ ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు.
జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు. ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ స్పందిస్తూ… భారత్ జీ20 అధ్యక్ష పగ్గాలు చేపట్టినందు, ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే థీమ్ ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు పనిచేయనున్నట్లు స్పష్టిం చేశారు.