Namaste NRI

జీ 20 సదస్సు…ప్రపంచ నేతలతో మోదీ చర్చలు

జీ 20 సదస్సుకు ఇటలీకి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌, మరికొందరు ప్రపంచ స్థాయి నేతలతో చర్చలు జరిపారు. వివిధ దేశాధినేతలను పలకరిస్తూ ఆయన ఇక్కడ వివిధ దేశాధినేతలను కలిసిన ఫోటోలను ఆ తరువాత ప్రధాని కార్యాలయం మీడియా వెలువరించింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, కెనడా దేశాధినేతలతో పలుకీలక అంశాలపై మోదీ తగు చొరవ తీసుకుని సంప్రదింపులు నిర్వహించారని పీఎంఓ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి ప్రధాని మోదీ ఇష్టాగోష్టిగా జరిపిన సంప్రదింపులకు ప్రాధాన్యత ఏర్పడిరదని అధికార వర్గాలు తెలిపాయి. 

                 జి 20 సదస్సుకు వచ్చిన భారత ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మేరియో డ్రాఫీుతో విస్తృత సంప్రదింపులు జరిపారు. ఇటలీ భారత్‌ నడుమ ఇప్పటి వరకూ ఉనన సత్సంబంధాలను మరింత విస్తృత పర్చుకోవాలని ఈ దశలో ఇరువురు నేతలు అవగాహనకు వచ్చారు. ప్రదాని మోదీకి ఇక్కడ ఇటలీ ప్రధాని తమ మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి స్వాగతం పలికారు. ఆ తరువాత ప్రధాని మోదీకి అధికారిక గౌరవ వందనం లభించింది. ఇరు దేశాల మధ్య పలు కీలక అంశాలలో మరింత పటిష్ట సహకారానికి వీలుందని నేతలు అంగీకారానికి వచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events