Namaste NRI

భైరవం నుంచి గజపతి వర్మ వచ్చాడు

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం భైరవం. విజయ్‌ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. మంగళవారం గణపతివర్మగా మంచు మనోజ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆయన ఫెరోషియస్‌గా రగ్గ్‌డ్‌ అవతార్‌లో కనిపిస్తున్నారు. మంచు మనోజ్‌ని గతంలో చూడని విధంగా ఇందు లో చూడబోతున్నారని, గణపతివర్మగా ఆయన పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. మరోవైపు మేకర్స్‌ ఈ సినిమా ప్రమోషన్స్‌ని కూడా వేగవంతం చేశారు. రీసెంట్‌గా విడుదల చేసిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, నారా రోహిత్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేశాయి.  ఈ చిత్రానికి మాటలు: సత్యర్షి, తూమ్‌ వెంకట్‌, కెమెరా: హరి కె.వేదాంతం, సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల, సమర్పణ: డా.జయంతిలాల్‌ గడ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress