Skip to main content

Namaste NRI

ఈగల్ మూవీలోని గల్లంతే లిరికల్ సాంగ్

రవితేజ  హీరోగా రూపొందిన చిత్రం ఈగల్‌. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. జనవరి 13న సినిమా విడుదల కానుంది. దావ్‌జాంద్‌ స్వరాలందించిన సినిమాలోని గల్లంతే అని సాగే రెండో పాటను ఈ రోజు చిత్రబృందం చేసింది . ఈ  సందర్భంగా రవితేజ మాట్లాడారు. ఈగల్‌ వాణిజ్య అంశాలతో కూడిన విభిన్నమైన సినిమా. వినోదం కావాల్సినంత ఉంటుంది. అందరికీ నచ్చే సినిమా ఇది అని అన్నారు.  కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్‌ కపిలన్‌, లిన్‌ కలిసి ఆలపించారు. ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, చదువుకునే రోజుల్లో రవితేజ అభిమానినైన తాను ఆయన సినిమాకు మ్యూజిక్‌ అందించడం ఆనందంగా ఉందని దావ్‌జాంద్‌ అన్నారు. రవితేజతో కలిసి నటించడం పట్ల కథానాయిక కావ్యా ధాపర్‌ ఆనందం వెలిబుచ్చింది. ఈ వేడుకలో చిత్రబృందం అంతా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News