మార్చి 3న దుబాయ్‌లోని జబిల్ పార్క్‌లో నాలుగవ గామా అవార్డ్స్ వేడుక వైభవంగా జరుగనుంది. ఏఎఫ్‌ఎం ప్రాపర్టీస్ సారథ్యంలో గామా అవార్డ్స్ అధ్యక్షుడు కేసరి త్రిమూర్తులు ఈ వేడుకను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో ఈ వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. అవార్డు జ్యూరీ ఛైర్మ న్‌గా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు కోటి, జ్యూరీ సభ్యులు వి.ఎన్.ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకులు సాయిరాజేశ్, ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయతి, గామా సీఈవో సౌరభ్, ఏఎఫ్‌ఏం ప్రాపర్టీస్ సునీల్, ఫణి మాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డు ట్రోఫీని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జ్యూరీ చైర్మన్ సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ కొవిడ్ కారణంగా మూడేళ్లు ఈ వేడుకకు గ్యాప్ వచ్చిందని, ఈ సారి టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను కేసరి త్రిమూర్తులు నిర్వహిం చనున్నారని, 2021, 22, 23 సంవత్సరాలకు చెందిన చిత్రాల నుంచి వివిధ కేటగిరీలకు అవార్డులు అందజేయనున్నామని తెలిపారు.
గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్య లో దుబాయ్ గామా వేదికపై చాలా ప్రెస్టేజియస్ గా ఈ వేడుక నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ ప్రముఖుల అందరి ని ఈ వేడుకకు ఆహ్వానించాం.గామా స్థాపించినప్పటి నుండి గామా అవార్డు వేదికకు సహాయ, సహకారాలు అందిస్తూ, అవార్డు ఫంక్షన్‌ను ప్రసారం చేస్తున్న ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు అని తెలియచేశారు.