Namaste NRI

ఉత్కంఠ రేకెత్తిస్తున్న గణపథ్ ట్రైలర్‌

టైగర్‌ష్రాఫ్‌, కృతిసనన్‌ జంటగా నటిస్తున్న చిత్రం గణపథ్‌. ఏ హీరో ఈజ్‌ బార్న్‌ ఉపశీర్షిక. వికాస్‌ భల్‌ దర్శకత్వం. ఈ చిత్రాన్ని జాకీ భగ్నానీ, వషూ భగ్నానీ, దీపశిఖ దేశ్‌ముఖ్‌ నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. రొమాంచితమైన యాక్షన్‌ ఘట్టాలతో, అబ్బురపరిచే విజువల్స్‌తో ట్రైలర్‌ ఆసాంతం ఆకట్టుకుంది. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ హైలైట్‌గా నిలిచింది. దుష్ణశిక్షణ కోసం పుట్టిన ఓ యోధుడు కథ ఇదని, ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో టైగర్‌ష్రాఫ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అమితాబ్‌బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలుర్పడ్డాయి. ఈ సినిమా అక్టోబర్ 20న హిందీతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events