Namaste NRI

వరుణ్‌తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా  గాండీవదారి అర్జున ఫస్ట్ లుక్

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి గాండీవదారి అర్జున అనే టైటిల్‌ని నిర్ణయించారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విటి 12’గా గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.    వరుణ్‌తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్‌పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. యాక్షన్‌ థ్ల్రిలర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా కనిపిస్తాడని, ఎదుటి వారిని ప్రమాదాల బారి నుంచి కాపాడే రోల్‌లో వరుణ్‌తేజ్‌ నటించడం వల్ల ఈ టైటిల్‌ను ఎంచుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. మిక్కి జే మేయర్‌ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సంగీతంతో పాటు నేపథ్య సంగీతం అందర్ని ఆకట్టుకునే విధంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి  మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 13న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events