Namaste NRI

గం.. గం.. గణేశా టీజర్ రిలీజ్

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం గం..గం..గణేశా. ఉదయ్‌శెట్టి దర్శకుడు. కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు శివ నిర్వాణ, అనుదీప్‌ కేవీ, డైరెక్టర్‌ కార్తీక్‌ దండు, మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌ డైరెక్టర్‌ వినోద్‌ అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ ఎనర్జిటిక్‌, కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. టీజర్‌ అందరూ బాగుందంటున్నారు. సినిమా అంతకంటే బాగుంటుంది. ఆనంద్‌ దేవరకొండకు ఇది డిఫరెంట్‌ జానర్‌. తొలిసారి యాక్షన్‌ హీరోగా కనిపిస్తారాయన. ఈ ఏడాది ఆనంద్‌కి ఇది సెకండ్‌ హిట్‌ అవుతుంది. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేస్తాం అని చెప్పారు. భయం, అత్యాశ, కుట్ర ఈ మూడింటి చుట్టూ తిరిగే కథాంశమిదనీ, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుందనీ, ఈ సినిమా దర్శకుడు ఉదయ్‌శెట్టికి మంచి పేరు తెచ్చిపెడుతుందనీ, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చే సినిమాగా నిలుస్తుందని ఆనంద్‌ దేవరకొండ ఆకాంక్షించారు. డైరెక్టర్ అనుదీప్ కేవీ మాట్లాడుతూ – డైరెక్టర్ ఉదయ్ నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు. కొన్ని కథలు నాకు చెప్పాడు. ఈ మూవీ చాలా బాగుంటుంది. టీమ్ అంతా కష్టపడ్డారు. బేబితో రీసెంట్ హిట్ అందుకున్న ఆనంద్ కు మరో విజయం ఈ సినిమా ఇస్తుందని కోరుకుంటున్నా అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events