కథానాయిక పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం మంగళవారం.అజయ్ భూపతి దర్శకుడు. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మాతలు. తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలిపాట గణగణ మోగాలిరా అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ కంటెంట్‌తో కమర్షియల్ చిత్రమిది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ జాతర నేపథ్యంలో ఈ పాటను తెరకెక్కించాం. కాంతారా, విరూపాక్ష చిత్రాలకు సంగీతం అందించిన బి.అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బాణీకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా, వి.ఎం.మహాలింగం ఆలపించారు అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర.
