Namaste NRI

ఘనంగా పూజా కార్యక్రమాలతో గాంగేయ మూవీ ప్రారంభం..

గగన్ విహారి, అవ్యుక్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గాంగేయ. ఈ చిత్రాన్ని ఎం విజయశేఖర్ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి. హేమకుమార్ రెడ్డి నిర్మిస్తునారు. బి.రామచంద్ర శ్రీనివాస కుమార్ దర్శకుడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో  ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సముద్ర క్లాప్ కొట్టగా, సమర్పకుడు ఎం విజయ శేఖర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ  మనుషుల మధ్య కుల, మత బేధాలు ఉండొద్దని ఈ చిత్రంలో చెబుతున్నాం. ఐదు భాషల్లో మా సినిమాను తెరకెక్కిస్తున్నాం  అన్నారు. నిర్మాత టి. హేమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గాంగేయ సినిమాను నేడు ప్రారంభించాం. అందరి సహకారంతో త్వరగా సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాం. నేడు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు థాంక్స్ అన్నారు. హీరో గగన్ విహారి మాట్లాడుతూ ఈ చిత్రంలో దైవభక్తి, దేశభక్తి, ప్రేమ.. ఇలాంటి భావోద్వేగ అంశాలు ప్రధానంగా ఉంటాయి  అని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events