లక్ష్, వేదికా దత్త జంటగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం గ్యాంగ్‌స్టర్ గంగరాజు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. వాడిప్పుడొక రక్తం మరిగిన పులిలాంటోడు… గ్యాంగ్‌స్టర్ కా గాడ్‌ఫాదర్ అనే సంభాషణతో మొదలైందీ ట్రైలర్. లక్ష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో ఆశ్చర్యానికి గురి చేసే అంశాలు చాలా ఉన్నాయి. జయసుధగారి అబ్బాయి నిహార్, నటి సత్యకృష్ణగారి కూతురు కూడా మూవీలో నటించారు అన్నారు. మంచి మూవీతో వస్తుండటం గర్వంగా ఉంది అన్నారు ఇషాన్. చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ మా బ్యానర్లో రామారావుగారు, నాగేశ్వరరావు గారు వంటి హీరోలతో సినిమాలు చేశాం. ఇప్పుడు దాదాపు 15 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. వీటిలో ఒకటి గ్యాంగ్‌స్టర్ గంగరాజు. ఇందులో కథానాయిక పాత్ర చాలా బాగుంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ అదిరిపోతుంది. తమిళంలోనూ సినిమాను రిలీజ్ చేస్తున్నాం అన్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. సంగీత దర్శకుడు సాయికార్తీక్, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు పాల్గొన్నారు.