సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం గంగూభాయ్ కతియావాడీ. ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఆలియా భట్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రఖ్యాత కవి హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా గంగూభాయ్ కతియావాది చిత్రాన్ని నిర్మించారు. గంగూభాయ్ టైటిల్ పాత్రలో ఆలియా నటిస్తోంది. ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా కమాటిపురాలో 1960 దశకంలో శక్తివంతమైన మహిళగా గంగూభాయ్ ఏలింది. ఆమె కథను భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్‌దేవగణ్ అతిథి పాత్రలో నటించారు. వచ్చె నెల జరగనున్న 72వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించనున్నారు. కరోనా వల్ల ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడిరది.