అశ్విన్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వచ్చినవాడు గౌతమ్. మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకత్వం. ఈ చిత్రాన్ని టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. మెడికో థ్రిల్లర్ కథాంశమిది. ఈ సినిమా టీజర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దర్శకుడు శైలేష్ కొలను విడుదల చేశారు. ధర్మం దారి తప్పినప్పుడు, ఏ అవతారం రానప్పుడు, వచ్చినవాడు గౌతమ్ అంటూ హీరో మనోజ్ మంచు వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ ఆసక్తికరంగా సాగింది. హీరో అశ్విన్‌బాబు పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించారు.

ఈ సందర్భంగా అశ్విన్‌బాబు మాట్లాడుతూ ఎవరూ ఊహించలేని కొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని తీశామని, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే అంశాలుంటాయని అన్నారు. రొటీన్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌కు భిన్నంగా ఉండే చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరిందని, సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. రియా సుమన్, అయేషాఖాన్, మురళీశర్మ, సచిన్‌ఖేడేకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్.బాల్‌రెడ్డి, సంగీతం: గౌర హరి, నిర్మాణ సంస్థ: అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మామిడాల ఎం.ఆర్.కృష్ణ.
