ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా గీత సాక్షిగా. చేతన్ రాజ్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆంథోనీ మట్టిపల్లి దర్శకుడు. ఈ చిత్ర పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఒక క్రైమ్ నేపథ్యంతో సాగు ఈ చిత్రంలో చిత్రశుక్ల లాయర్ పాత్రలో నటిస్తున్నది. ఇంతకు ముందు ఫస్ట్ లుక్‌కి సంబంధించిన ప్రీ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్‌లో కోర్టు మరియు పోలీసు విచారణకు సంబంధించిన విషయాలను చూపిస్తూ నేరం మరియు న్యాయంపై ఆధారాపడిన బలమైన సబ్జెక్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా చూపించారు. ఇప్పుడు విడుదల చేసిన ఫస్ట్ పోస్టర్‌ను కూడా ఆసక్తికరంగా ఉంది. అలాగా సెకండ్ లుక్‌ను పోస్టర్‌లో శ్రీకాంత్ అయ్యంగార్ లాయర్ వేషంలో ఎంతో శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ. సంగీతం: గోపీ సుందర్.
