హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎన్నికల ఇంచార్జి నల్ల శివారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుసని అన్నారు. అందుకే ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్‌కే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్, జమ్మికుంటలో సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు, మిగతా కార్యవర్గ సభ్యులు ప్రచారములో పాల్గొననున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఊరూరా ఘన స్వాగతం లభిస్తున్నదని తెలిపారు. గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)