
అనూహ్యంగా పెరిగిన పావురాల సంఖ్య జర్మనీలోని ఓ పట్టణానికి పెద్ద సమస్యగా మారింది. దీంతో వీటి సంఖ్య తగ్గింపుపై ఇటీవల రెఫరెండం నిర్వహించగా, స్థానికులంతా పావురాల నిర్మూలనకు అనుకూలంగా ఓటేశారు. పశ్చిమ జర్మనీలోని లిమ్‌బర్గ్‌లో పావురాలు, వాటి మలంతో వస్తున్న ఇబ్బందులపై స్థానికులు, మార్కెట్ విక్రేతలు, రెస్టారెంట్ నిర్వాహకుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పావురాల సంఖ్యను అరికట్టాలని లిమ్‌బర్గ్ టౌన్ కౌన్సిల్ నిర్ణయించింది. వాటిని చంపేందుకు చర్యలు చేపడతామని ప్రకటించింది. జంతు ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు నిరసనకు దిగటంతో, టౌన్ కౌన్సిల్ నిర్ణయంపై రెఫరెండం నిర్వహించాల్సి వచ్చింది.
