జర్మనీ నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం వెతుకుతున్నది. దేశాభివృద్ధికి దోహదపడే నైపుణ్యం కలిగిన నిపుణులకు తలుపులు తెరవడానికి సిద్ధమవుతున్నది. భారతదేశంతోపాటు ఇతర దేశాల నుంచి నైపుణ్యం కలిగిన కార్మికుల ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మెరుగుపరిచేందుకు ఒక ముసాయిదాను సిద్ధం చేశారు. కాగా, ఒక సమావేశంలో సమగ్ర భాగస్వామ్య ఒప్పందాలపై భారత-జర్మనీ విదేశాంగ మంత్రులు జైశంకర్, అన్నలెనా బేర్‌బాక్ సంతకాలు చేశారు. జర్మన్ ప్రభుత్వం తన పౌరసత్వ చట్టాలను మార్చేందుకు సిద్ధమైంది. విదేశాల నుంచి నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించేందుకు పౌరసత్వ చట్టాల్లో భారీ మార్పులు చేస్తున్నది. వాస్తవానికి, జర్మనీకి డిజిటలైజేషన్ అవసరం. ఇది అక్కడ ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని నిపుణులు నమ్ముతున్నారు. విదేశాల నుంచి ఐటీ నైపుణ్యం ఉన్న వారి కోసం జర్మనీ తీవ్రంగా వెతుకుతున్నది. ముసాయిదా చట్టం వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడానికి జర్మనీలో కనీసం ఎనిమిదేండ్ల రెసిడెన్సీ అవసరాలను ఐదేండ్లకు తగ్గించే వీలున్నది. అమెరికాలో ఉద్యోగాల్లో కోతలు జర్మనీ ప్రభుత్వ నిర్ణయం ఆశలు రేపుతున్నది.