
ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. నితిన్, భరత్ కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ప్రదీప్, దీపికా జంటను ఓ రౌడీ గ్యాంగ్ వెంబడించడం ఈ పోస్టర్లో చూడొచ్చు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్‌శ్రీను, మురళీధర్‌గౌడ్, జి.ఎం.సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎంఎన్ బాలరెడ్డి, సంగీతం: రధన్.
