అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా 366 రోజుల పాటు ఘంటసాల స్వర రాగ మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్ మరియు శుభోదయం గ్రూప్ సంయుక్తం చేపడుతున్నాయి. 2021 డిసెంబరు 04 నుంచి 2022 డిసెంబరు 04 వరకు ఈ మహాయాగం కొనసాగనుంది. ప్రతీ శని, ఆదివారాలలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు (భారత కాలమానం) వర్చువల్‌గా ఈ వేడుకలు జరుగుతాయి. ప్రారంభోత్సవ ప్రత్యేక కార్యక్రమం డిసెంబరు 4 సాయంత్రం 5:30 గంటలకు మొదలవుతుంది. ప్రతిరోజు గాయనీ గాయకులచే ఘంటశాల గానామృత, ప్రముఖ రచయితలచే అక్షర నివాళి కార్యక్రమం జరగనుంది.














