Namaste NRI

జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో ఘంటసాల శత జయంతి ఉత్సవాలు

వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం ఆధ్యర్యంలో సంక్రాంతి వేడుకలు, ఘంటసాల శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరిగాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలను మేం మర్చిపోతున్నా మీరు కొనసాగిస్తుండటం అభినందనీయం. ఘంటసాల శతజయంతి ఉత్సవాలు వంటివి సినిమా వాళ్లుగా మేం చేయలేనందుకు సిగ్గుపడుతున్నాం. ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనని గుర్తుంచుకోవాలి. జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలు ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపాయి. ఇంత బాగా నిర్వహించిన సంస్థ అధ్యక్షులు కృష్ణ లాంను అభినందించారు  అని అన్నారు.

డాక్టర్ ముల్పూరి వెంకట్రావు మాట్లాడుతూ సంక్రాంతి ప్రతి ఒక్కరికీ ఇష్టమైన పండుగని అన్నారు. ఈ పర్వదిన విశిష్టతను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని చెప్పారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ  ఏ జాతైతే తన మాతృభాషను, సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతుందో ఆ జాతి అంతరించిపోతుందని చెప్పారు. భాష నాగరికతను నేర్పిస్తుంది. ముఖ్యంగా భాషే ఒక సాంస్కృతిక వారథి అని వ్యాఖ్యానించారు. 

ఈ కార్యక్రమంలో సంస్థ పూర్వాధ్యక్షులు సత్యనారాయణ మన్నె, రవి గవిరినేని, సాయిసుధ పాలడుగు, కిషోర్ తంగేటి, జీడబ్ల్యూటీసీఎస్ కార్యవర్గ సభ్యులు సుశాంత్ మన్నె, యాష్ బొద్దులూరి, చంద్ర మలావతు, రాజేష్ కాసరనేని, ఉమాకాంత్ రఘుపతి, ఫణి తాళ్లూరి, శ్రీనివాస్ గంగ, ప్రవీణ్ కొండక,   విజయ్ అట్లూరి, సుష్మ అమృతలూరి, కార్తీక్ కోమటి, రవి అడుసుమిల్లి, శ్రీవిద్య సోమ, భాను మాగులూరి, పాల్గొన్న ఇతర ప్రముఖులు రమాకాంత్ కోయ, రామ్ చౌదరి ఉప్పుటూరి, విజయ్ గుడిసేవ, సాయి బొల్లినేని తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events