గానగంధర్వుడు ఘంటసాల వేంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఘంటసాల ది గ్రేట్. గాయకుడు కృష్ణచైతన్య ఘంటసాల పాత్ర పోషించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల కనిపించనుంది. చిన్ననాటి ఘంటసాలగా అతులిత నటించారు. సి.హెచ్.రామారావు దర్శకత్వంలో సి.హెచ్.ఫణి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. రేలంగి నరసింహారావు, తమ్మారెడ్డి భరద్వాజ్. జె.కె.భారవి, చదలవాడ శ్రీనివాస్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ అతిథులుగా విచ్చేసి టీమ్‌కి శుభాకాంక్షలు అందించారు.

ఘంటసాల జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో ఘంటసాలగా నటించా. ఇది నాకు దేవుడిచ్చిన వరం అని కృష్ణచైతన్య అన్నారు. కోట్లాదిమందికి ఆరాధ్యుడైన ఘంటసాల జీవితంలోని ఎత్తుపల్లాలు అందరికీ తెలియాలనే ఈ సినిమా చేశాను. దేశచరిత్రలో ఓ సింగర్ బయోపిక్ తెరకెక్కడం ఇదే ప్రథమం అని దర్శకుడు సి.హెచ్.రామారావు తెలిపారు. ఈ సినిమా మరో శంకరాభరణం కావాలని డిస్ట్రిబ్యూటర్ శోభారాణి ఆశాభావం వెలిబుచ్చారు.
















