అనుష్క ప్రధాన పాత్రగా రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఘాటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతున్నది. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే గ్లింప్స్‌ని విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదల కానున్నదని మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో చీరకట్టుకొని, చేతిలో తుపాకీతో కొండపై నిలబడి టెర్రిఫిక్ లుక్‌లో కనిపిస్తున్నది అనుష్క. ఆమె శరీరమంతటా చెల్లాచెదురుగా ఉన్న రక్తపు గుర్తులు పాత్రలోని ఉద్వేగాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: చింతకింది శ్రీనివాసరావు, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: మనోజ్‌రెడ్డి కాటసాని, సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్, కళ: తోట తరణి.