Skip to main content

Namaste NRI

శ్రీవిష్ణు శ్వాగ్‌ నుంచి గ్లింప్స్‌ విడుదల

శ్రీవిష్ణు  హీరోగా నటిస్తోన్న చిత్రం శ్వాగ్‌.  హసిత్‌గోలి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో శ్రీవిష్ణు భవభూతి అనే స్త్రీ ద్వేషి పాత్రలో కనిపించారు. అతని లుక్స్‌, మేకోవర్‌ సరికొత్తగా ఉంది. భవభూతి పాత్రలో శ్రీవిష్ణు అద్భుతమైన నటనను కనబరిచాడని, ఆద్యంతం వినోదాత్మక అంశాలతో సినిమా ఆకట్టుకుంటుంద ని మేకర్స్‌ తెలిపారు. రీతూవర్మ, మీరా జాస్మిన్‌, దక్ష నగార్కర్‌, శరణ్యప్రదీప్‌ తదితరులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేదరామన్‌ శంకరన్‌, సంగీతం: వివేక్‌సాగర్‌, రచన-దర్శకత్వం: హసిత్‌గోలి.

Social Share Spread Message

Latest News