Namaste NRI

సింగపూర్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

వినాయకచవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ కల్చరల్‌ సొసైటీ సింగపూర్‌ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు  ఇరువంటి శ్రావణ్‌ కుమర్‌ శర్మ ఆన్‌లైన్‌ లో ఈ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయడంతో చాలా మంది భక్తులు ఇంటి నుంచే పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాథుడి ఆశీర్యాదం పొందారు. సకల విఘ్నాలు తొలగి వినాయకుడి ఆశీస్సులు తమపై  ఉండాలని భక్తులు వినాయకుడిని కోరుకున్నారు. ఈ పూజా కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నడికట్ల భాస్కర్‌, నంగునూరి సౌజన్య, శివ ప్రసాద్‌ ఆవుల మరియు, రవి కృష్ణ విజాపూర్‌ వ్యవహరించారు.

సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, సునీత రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకటరమణ, ఇత‌ర‌ కార్యవర్గ సభ్యులు, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, ప్రవీణ్ మామిడాల, శశిధర్ రెడ్డి మరియు కాసర్ల శ్రీనివాస్ వేడుక‌ల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్భంగా సుమారు 50 మంది భక్తులు కుటుంబ సమేతంగా జూమ్‌ యాప్‌ ద్వారా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events