కెనడాలోని టొరంటోలో ఘనంగా గణపతి హోం నిర్వహించారు. ఈ నెల 11న లక్ష మోదక హోమంతో వినాయక చవితి సంబురాలు చేసుకున్నారు. జీఆర్డీ అయ్యర్స్ గురుకుల్ వ్యవస్థాపకుడు రమేశ్ నటరాజన్, గాయత్రి నటరాజన్ ఆధ్వర్యంలో కెనడాలోనే తొలిసారిగా హోమం నిర్వహించారు. స్థానికంగా అమెరికా నుంచి ఇండియా నుంచి తయారు చేసిన తీసుకొచ్చిన లక్ష మోదకాలను స్వామికి సమర్పించి, కొవిడ్ నుంచి లోకాన్ని రక్షించాలని కోరుకున్నారు. తాజాగా రుద్రహోమం, చండీ హొమం నిర్వహించారు. ప్రపంచ శక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒహాయోలోని హిందూ దేవాలయం ఆఫ్ డేటన్‌లో ఈ హోమాలను నిర్వహిస్తున్నట్టు రమేశ్ నటరాజన్ తెలిపారు. అందరికీ మహా గణపతి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.