మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రంలో నయన తార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ గాడ్ ఫాదర్ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ చిత్రం నుంచి మాస్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. థార్ మార్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేయడంతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 5న తెలుగు, హిందీ బాషల్లో రిలీజ్ కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)