చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం గాడ్‌ఫాదర్. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయన తార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని థార్ మార్ థక్కర్ మార్ పాట లిరికల్ వీడియో ప్రొమోను విడుదల చేశారు. పూర్తి లిరికల్ వీడియో ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం అక్టోబరు 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.














